రష్యా గగనతలంపై యూకే విమానాలు నిషేధం

ఉక్రెయిన్ పై దాడిని వ్యతిరేకిస్తూ రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేలా యూకే ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో పుతిన్ కూడా యూకేకు దిమ్మతిరిగే విధంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.బ్రిటన్  కు చెందిన ఏరోప్లాంట్ విమానాలు తమ గగనతంలోకి రాకుండా రష్యా నిషేధించింది.సరుకు రవాణా విమానాలను కూడా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. పుతిన్ హేయమైన చర్యలను ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసేవారిని ఎప్పటికీ సహించేది లేదని యూకే స్పష్టం చేసింది. బ్రిటీష్ ఎయిర్‌వేస్ మాతృ సంస్థ IAG ప్రధాన మంత్రి ఆదేశాలను అనుసరించి రష్యా గగనతలంలోకి ప్రవేశించకుండా విమానాలను దారి మళ్లిస్తామని తెలిపింది.

మరిన్ని వార్తల కోసం

ఉక్రెయిన్ రాజధానిని ఆక్రమించిన రష్యా 

అయ్యో ఉక్రెయిన్.. ఎంత కష్టమొచ్చింది..!