ఉక్రెయిన్‌లో 20 శాతం మాత్రమే రష్యా ఆధీనంలో ఉందని దేశ అధ్యక్షులు జెలెన్స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ లో ఐదో వంతు మాత్రమే రష్యా ఆధీనంలో ఉందంటున్నారు. రష్యా జరుపుతున్న దాడులు 100వ రోజుకు చేరుకున్నాయి. దేశంలోని కైవ్, ఖార్కివ్ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంలో రష్యా బలగాలు విఫలం చెందాయి. దీంతో దాడులను మరింత ఉధృతం చేసింది. ప్రతి రోజు 100 మంది సైనికులు చనిపోతున్నారని గతంలో జెలెన్స్కీ వెల్లడించిన సంగతి తెలిసిందే. డాన్ బాస్ ప్రాంతంలో భాగమైన Lugansk లోని Severodonetsk పారిశ్రామిక నగరంలో పోరాటాలు చెలరేగాయి. 80 శాతం ఇప్పుడు రష్యన్ దళాల నియంత్రణలో ఉంది. చివరి వరకు ఉక్రెయిన్ దళాలు పోరాటం జరుపుతాయని రీజినల్ గవర్నర్ Lugansk ప్రమాణం చేశారు. ఐరోపాలోని అతిపెద్ద కర్మగారాల్లో ఒకటైన Severodonetsk లో ఉన్న అజోట్ కర్మాగారాన్ని రష్యా సైనికులు లక్ష్యంగా చేసుకున్నారు. మిథనాల్ నిల్వ ఉంచిన గౌడోన్ పై దాడులు చేసినట్లు సమాచారం.
రష్యా సేనలు ముందుకు సాగకుండా ఆయుధాలను సరఫరా చేయాలని ఉక్రెయిన్ ఇతర దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. HIMARS బహుళ-రాకెట్ లాంచర్‌లను అందజేస్తామని యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యూఎస్ ఇప్పటికే 4.5 బిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని పంపడం విశేషం. మరి ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి రెండు వైపులా ఎంతో మంది మృతి చెందారు. ప్రపంచంలోని పలు దేశాలపై యుద్ధ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ప్రత్యక్షంగా.. పరోక్షంగా ప్రభావం పడుతోంది. యుద్ధం ఆపేందుకు పలు దేశాలు ప్రయత్నించి.. విఫలం చ చెందాయి. సామాన్య పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా పలుమార్లు యుద్ధానికి విరామం ప్రకటించింది రష్యా.
మరిన్ని వార్తల కోసం :
ఉక్రెయిన్ కు అత్యాధునిక రాకెట్లను ఇస్తం
చైనాలో లాక్ డౌన్ ఆంక్షల సడలింపు