
మాస్కో: మే 9న తమ దేశంలో జరిగే విక్టరీ డే పరేడ్ వేడుకలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీని రష్యా ఇన్వైట్ చేసింది. ఈ మేరకు మోదీని తమ ప్రభుత్వం ఆహ్వానించిందని రష్యా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఆండ్రీ రుడెంకో వెల్లడించారు. రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీపై సాధించిన విజయానికి గుర్తుగా రష్యా ఏటా మే 9న 'విక్టరీ డే'ను నిర్వహిస్తున్నది. జర్మనీపై గెలుపొంది 80 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తున్నది. అందులో భాగంగానే మోదీతోపాటు తమ మిత్రదేశాలన్నింటికి ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు ఆండ్రీ రుడెంకో పేర్కొన్నారు. దాదాపు ఐదేండ్ల తర్వాత ప్రధాని మోదీ గతేడాది జులైలో రష్యాలో పర్యటించారు.