
గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ జర్నలిస్టు ఎవాన్ గెర్ష్‌కోవిచ్‌కు శుక్రవారం రష్యా కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు స్వెర్ద్‌లోవ్స్క్ ప్రాంతీయ న్యాయస్థానం జడ్జి ఎండ్రై మైనైవ్ తీర్పు వెలువరించారు. 478 రోజులుగా ఎవాన్ రష్యాలో అక్రమ నిర్బంధంలో ఉన్నారు. తాజాగా వెలువుడిన శిక్షను వాల్‌స్ట్రీట్ జర్నల్, అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించాయి. ఇది రాజకీయ ప్రేరిత కేసుగా అభివర్ణించాయి. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో పోరాడుతామని చెప్పాయి.