ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వదిలితే.. ఆ దేశంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమేనని రష్యా సంచలన ప్రకటన చేసింది. దీనికి సంబంధించి రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీలారోవ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉక్రెయిన్ సైన్యం తక్షణమే పోరాటం ఆపాలని అన్నారుసెర్గీలారోవ్. తమ చేతుల్లోని ఆయుధాలను వదిలేయాలని.. ఆ తర్వాత రష్యా సైన్యానికి లొంగిపోవాలని తెలిపారు. మొత్తంగా ఉక్రెయిన్ సైన్యం తమకు సరెండర్ అయిపోతేనే ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని రష్యా ప్రకటించింది.
మరిన్ని వార్తల కోసం..