రష్యాలో ఘోర రైలు ప్రమాదం.. 9 బోగీలు బోల్తా..

రష్యాలో ఘరో రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 70 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. 2024, జూన్ 26వ తేదీ బుధవారం ఉత్తర కోమి ప్రాంతంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిందని.. దీంతో 9 రైలు బోగీలు బెల్తా పడ్డాయని కోమి ప్రాంతీయ గవర్నర్ వ్లాదిమిర్ ఉయ్బా వెల్లడించారు. ఇంటా పట్టణానికి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో.. 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని గవర్నర్ ఉయ్బా తెలిపారు.

సమాచారం అందుకున్న స్థానిక రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానిక చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు.
 పట్టాలు తప్పిన సమయంలో రైలులో 215 మంది ప్రయాణికులు ఉన్నారని.. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.