రష్యా ఉక్రెయిన్ యుద్ధం..12 మంది భారతీయులు మృతి

  • మరో 16 మంది మిస్సింగ్: కేంద్రం

న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్  యుద్ధంలో రష్యా తరపున పోరాడుతున్న 12 మంది ఇండియన్లు చనిపోయారని, మరో 16 మంది గల్లంతయ్యారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్​ధీర్ జైస్వాల్ తెలిపారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ 126 మంది ఇండియన్లు రష్యా తరపున పోరాడారని, వారిలో 96 మందిని రష్యా మిలిటరీ డిశ్చార్జ్  చేసిందని తెలిపారు. ఆ 96 మంది తిరిగి స్వదేశానికి చేరుకున్నారని వెల్లడించారు. 

18 మంది ఇంకా రష్యా ఆర్మీలో ఉన్నారని, వారిలో 16 మంది ఆచూకీ తెలియదన్నారు. వారి ఆచూకీ త్వరగా కనుగొని ఇండియాకు తరలించాలని రష్యా ప్రభుత్వాన్ని కోరామని వివరించారు. కేరళకు చెందిన బినిల్  బాబు మృతిపైనా రణ్ ధీర్  స్పందించారు. ఉక్రెయిన్ తో యుద్ధంలో అతను చనిపోయాడని, అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.