డిప్యూటీ CM పవన్ కల్యాణ్‎ను కలిసిన రష్యా వ్యోమగామి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‎ను రష్యా వ్యోమగామి సెర్గీ కోర్సకొవ్ కలిశారు. హైదరాబాద్‎లోని పవన్ కల్యాణ్ నివాసంలో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో కలిసి సెర్గి జనసేనానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్జ్ ఇండియా ప్రతినిధుల బృందం పవన్ కల్యాణ్‎ను కోరారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన అవసరమన్న పవన్.. విద్యార్థులను సైంటిస్టులుగా తయారు చేయాలన్నారు. విద్యార్థులు  సెంటిస్టులుగా మారేందుకు తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

ALSO READ | సినిమాల కన్నా దేశమే ముఖ్యం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

 అనంతరం రష్యా అస్ట్రోనాట్ సెర్గిని పవన్ కల్యాణ్ సన్మాంచి.. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 రాకెట్ నమూనాను అతడికి బహుకరించారు. కొన్ని నెలల పాటు అంతరిక్షంలో గడిపిన సెర్గిని.. స్పేస్ కు సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది మేలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పిఠాపురం నుండి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెల్చిన పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎం వరించింది. డిప్యూటీ సీఎంతో పాటు అటవీ, పర్యావరణ, సెన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కల్యాణ్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పవన్ పవన్‎ను అస్ట్రోనాట్ సెర్గి, స్పేస్ కిడ్జ్ ఇండియా ప్రతినిధులు కలిశారు.