మాస్కోలో టెర్రర్ అటాక్.. 40 మందికి పైగా మృతి

  • వందల మందికి గాయాలు

మాస్కో: రష్యా రాజధాని మాస్కో సమీపంలోని క్రాస్నో గార్క్ సిటీలో టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. శుక్రవారం రాత్రి క్రోకస్ సిటీ హాల్లో షో జరుగుతుండగా గన్స్ తో చొరబడి ఇష్టారీతిన కాల్పులు జరిపారు. బాంబులు విసురుతూ బీభత్సం సృష్టించారు. ఇందులో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలమంది గాయపడ్డారు. పోలీసుల జరిపిన కాల్పుల్లో నలుగురు టెర్రరిస్టులను హతమయ్యారు. దుండగులు బాంబులు విసరడంతో బిల్డింగ్ అంతటా మంటలు వ్యాపించాయి.