- ఆరుగురు మృతి.. 11 మందికి గాయాలు
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులను కొనసాగిస్తూనే ఉంది. శుక్రవారం రాత్రి ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద సిటీ అయిన ఖార్కిప్పై డ్రోన్‌లు, క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో ఆరుగురు చనిపోయారు. మరో 11 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షిపణి దాడులతో సిటీలోని ఇండ్లు, గ్యాస్ స్టేషన్, కేఫ్, దుకాణం, కార్లు దెబ్బతిన్నాయని ఖార్కివ్ ఏరియా గవర్నర్ చెప్పారు.
రష్యా.. 32 ఇరాన్ మేడ్ షాహెద్ డ్రోన్‌లు, 6 క్షిపణులను ప్రయోగించిందని కమాండర్ తెలిపారు. అలాగే, ఉక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు రష్యాకు చెందిన మూడు క్రూయిజ్ క్షిపణులు, 28 డ్రోన్‌లను కూల్చివేసినట్లు లెఫ్టినెంట్ జనరల్ మైకోలా ఒలేష్‌చుక్ తెలిపారు.