
భార్యకు ప్రేమతో ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు ఓ భర్త..లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ప్రేమకు ప్రతీక అయిన వాలంటైన్స్ డే రోజు ఆమె గిఫ్ట్గా ఇచ్చాడు.. అయితే అది ఆమెకు నచ్చలేదు..తిరస్కరించింది. ఆమెకు నచ్చనిది నాకూ వద్దు అనుకున్నాడో ఏమో వెంటనే లక్షల విలువైన కారును చెత్తకుప్పలో పడేశాడు. ఇంతకీ అంత ఖరీదైన కారు ఆమెకు ఎందుకు నచ్చలేదు.. భర్త ఎందుకు అంత నిరాశకు గురయ్యాడో.. వివరాల్లోకి వెళితే..
రష్యా స్థానిక మీడియా కథనాల ప్రకారం..రష్యా రాజధాని మాస్కో సమీపంలో మైటిష్చి పట్టణంలో ఓ జంట గత కొంత కాలంలో కుటుంబ తగాదాలతో దూరంగా ఉంటు న్నారు. భార్యను ప్రసన్నం చేసుకునేందుకు భర్త గట్టి ప్రయత్నాలే చేశాడు. అయితే ఏవీ ఫలించలేదు. ఓ ఖరీదైన గిఫ్ట్ తో భార్యను కూల్ చేయాలనుకున్నాడు.
అనుకున్నట్లుగానే సుమారు 27లక్షలు పోసి పోర్షేకారును కొనుగోలు చేశాడు. అయితే కారు ఇంతకుముందే యాక్సిడెంట్ లో స్వల్ప డ్యామేజీ అయింది. దీంతో రెడ్ రిబ్బన్ కట్టి వాలెంటైన్స్ రోజున గిఫ్ట్ గా ఇచ్చాడు. డ్యామేజ్ గమనించిన అతని భార్య ఆ బహుమతిని తిరస్కరించంది.
దీంతో మనోడికి బీపీ పెరిగింది. ఆ పోర్షేకారును తీసుకుపోయి పెద్ద చెత్తకుప్పలో పడేశాడు. ఇంత విలువైన కారును పడేయడం ఓ వింత అయితే.. ఆ కారును చెత్తకుప్ప కంటైనర్ ఎలా పట్టించాడనేది మరొక వింత. ఈ విషయం తెలిసిన వారంతా ఈ కారును చూసేందుకు రావడంతో ఇప్పుడదో టూరిస్ట్ ప్లేస్ మారిపోయిం దంటున్నారు.