జైలులో మరణించిన పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ

మాస్కో: రష్యన్ ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ  శుక్రవారం జైలులో మరణించారు. ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలో ఆయన మృతి చెందినట్టు జైలు అధికారులు తెలిపారు. వాకింగ్ తర్వాత నావల్నీ అస్వస్థత కు గురయ్యారు. చికిత్స అందిస్తూ కాపాడటానికి ప్రయత్నిం చినా ఫలితం లేకపోయింది. నావల్నీ మరణానికి  కారణాలు తెలియాల్సి ఉంది’ అని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు చెప్పారు.

రష్యా విపక్ష నేతలలో నావల్నీ ప్రముఖుడు. ప్రెసిడెంట్​ పుతిన్ అవినీతిపై  ఫైట్​ చేస్తూ ప్రజల్లో భారీగా ఫాలోయింగ్​ సంపాదించుకున్నారు. వివిధ కేసుల్లో కోర్టు ఆయనకు 19 ఏండ్ల జైలు శిక్ష విధించింది. 2021 నుంచి నావల్నీ జైలులోనే ఉన్నారు.