పుతిన్ మూడేళ్లకు మించి బతకడం కష్టమే ?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి బ్రిటన్ కు చెందిన మీడియా సంస్థ ‘ఇండిపెండెంట్’సంచలన కథనాన్ని ప్రచురించింది. ‘పుతిన్ కు ఉన్న క్యాన్సర్ వ్యాధి బాగా ముదిరిపోయింది. మహా అయితే.. మరో మూడేళ్లకు మించి ఆయన బతకడం కష్టమే’ అని కథనంలో పేర్కొంది. 69 ఏళ్ల వయసుకు చేరిన పుతిన్ కంటిచూపు కూడా క్రమంగా మందగిస్తోందని తెలిపింది. వైద్యులు ఈవిషయాన్ని పుతిన్ కు కూడా చెప్పేశారని కథనంలో ప్రస్తావించింది. ప్రస్తుతం బ్రిటన్ లో తలదాచుకుంటున్న రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ( ఎఫ్ఎస్బీ) మాజీ  అధికారి బోరిస్ కార్పిచ్కోవ్ ఈవిషయాన్ని వెల్లడించారని ‘ఇండిపెండెంట్’స్పష్టం చేసింది. అయితే ఈ వార్తలను రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఖండించారు.  పుతిన్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. అంతగా సందేహం ఉంటే.. పుతిన్ ప్రసంగాల వీడియోలను చూడాలని సూచించారు. మరో బ్రిటన్ మీడియా సంస్థ ‘ఎక్స్ ప్రెస్’కూడా గతంలో పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి ఓ కథనాన్ని ప్రచురించింది. పొత్తి కడుపులోని కొన్ని స్రావాలను తొలగించేందుకు సంబంధించిన శస్త్రచికిత్సను పుతిన్ చేయించుకున్నారనేది ఆ కథనం సారాంశం. ‘‘పుతిన్ శరీర అవయవాలు చాలా బలహీనమయ్యాయి. వాటి పనితీరు ప్రస్తుతం అదుపులో లేదు’’అంటూ బ్రిటన్ కు చెందిన ‘మెట్రో’ మీడియా వెబ్ సైట్ కూడా ఒక స్టోరీని ఇటీవల ప్రచురించింది. 

మరిన్ని వార్తలు..

సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు

సివిల్స్ 2021 ఫలితాలు విడుదల