
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ కు రానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు భారత్ లో పుతిన్ త్వరలోనే పర్యటించనున్నారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు.‘రష్యా అండ్ ఇండియా: టువర్డ్ ఏ న్యూ బై లేటరల్ ఎజెండా’ పేరుతో రష్యన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కౌన్సిల్ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
భారత ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి అంతర్జాతీయ పర్యటనను రష్యాలో చేసిన విషయాన్ని లావ్రోవ్ గుర్తు చేశారు. ఇప్పుడు తమవంతు వచ్చిందన్నారు. అయితే, పర్యటన తేదీలను మాత్రం వెల్లడించలేదు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించడం ఇదే మొదటిసారి.