రష్యా గూఢచారిగా అనుమానిస్తున్న బెలూగా తిమింగలం నార్వే తీరంలో శవమై కనిపించింది. నివేదికల ప్రకారం, దక్షిణ నార్వేలోని రిసావికా బేలో తండ్రీకొడుకులు చేపలు పడుతుండగా తిమింగలం మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. "హ్వాల్డిమిర్" అని ముద్దుగా పిలిచుకునే ఈ తిమింగలం వయసు 14 నుండి 17 సంవత్సరాల వయస్సు ఉంటుందని అంచనా.
గూఢచారిగా అనుమానాలు!
గూఢచర్య ప్రయోజనాల కోసం రష్యాచే శిక్షణ పొందినట్లు అనుమానాలు రేకెత్తించిన ఈ బెలూగా తిమింగలం మొదటిసారి 2019లో నార్వేజియన్ ప్రాంతాల్లో కనిపించింది. ఆ సమయంలో నార్వేజియన్ సముద్ర జీవశాస్త్రవేత్తలు "సెయింట్ పీటర్స్‌బర్గ్ యొక్క సామగ్రి" అని రాసి ఉండి తిమింగలానికి అమర్చిన గోప్రో కెమెరాను కనుగొన్నారు. దాంతో, ఇది గూఢచారి తిమింగలం కావచ్చని పుకార్లు వ్యాపించాయి. ఆ ఊహాగానాలకు మాస్కో ఏనాడూ స్పందించింది లేదు.
సాధారణంగా ఇలాంటి బెలూగా వేల్స్ ఆర్కిటిక్ సముద్రంలో అతిశీతల ప్రాంతాల్లో నివసిస్తాయి.
Also Read :- స్వాతి మలివాల్‌పై దాడి కేసు
Beluga whale alleged to be Russian ‘spy’ found dead in Norway.
— Yasmina (@yasminalombaert) September 2, 2024
A mysterious death has sparked intrigue off Norway’s coast, as Hvaldimir, the beluga whale suspected of being a "Russian spy," was found dead in Risavika Bay.
Known for his friendly nature and links to Russian… pic.twitter.com/JEIJiv2uJs