
అమెరికా జరిపిన శాంతి చర్చలు విఫలం కావడంతో ఉక్రెయిన్పై రష్యా దాడులు తీవ్రతరం చేసింది. రాత్రి వేళల్లో డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడింది. ఉక్రెయిన్లో ప్రధాన నగరాలైన ఖార్కీవ్, డొంటెస్క్లోని నివాసస్థలాలపై డ్రోన్స్, మిస్సైల్స్తో దాడులు చేసింది. ఈ డాడుల్లో 20 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. డెనట్ స్కూలోని డోబ్రోపిల్యాలో 8 నివాస భవనాలు, ఒక అడ్మినిస్ట్రేషన్ భవనం పై డ్రోన్స్ దాడులు జరగడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి.
రష్యా దాడిలో డోబ్రోపిలియాలో ఓభవనం నుంచి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఉక్రెయిన్పై కాల్పుల విరమణ అమలు చేయాలి.. మళ్లీ చర్యలు జరపాలి లేదంటే ఆంక్షలు తప్పవని రష్యాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఉక్రెయిన్ యుద్ధభూమిలో రష్యా పూర్తిస్థాయిలో బలగాలతో దాడులు జరుపుతోంది.
గతవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, ట్రంప్ మధ్య వాగ్వాదం తర్వాత నిఘా,సైనిక సహాయాన్ని నిలిపివేశారు. అమెరికా శాటిలైట్ ఫొటోలు షేరింగ్ లేకుండా చేయడంతో రష్యా బాంబు దాడుల నుంచి తనను తాను రక్షించుకునే ఉక్రెయిన్ సామర్థ్యం తగ్గిపోయింది.
ALSO READ | పబ్ లో అర్థరాత్రి కాల్పులు.. 12 మందికి బుల్లెట్ గాయాలు
శుక్రవారం రాత్రి ఉక్రెయిన్‌లోని డొనెట్ స్కూ ప్రాంతంలో జరిగిన డ్రోన్స్, మిస్సైల్స్ దాడుల్లో 11 మంది మరణించారు. ఈ దాడిలో డోబ్రోపిల్యా పట్టణంలోని ఎనిమిది అపార్ట్‌మెంట్ బ్లాక్‌లు దెబ్బతిన్నాయి. రష్యన్ డ్రోన్ ఉక్రేనియన్ అగ్నిమాపక ట్రక్కును ధ్వంసం చేసిందని ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. అయినప్పటికీ దళాలు కాలిపోతున్న భవనాలను ఆర్పడానికి పోరాడుతున్నారు.
పోక్రోవ్ స్కూ, కోస్టియాంటినివ్కా, మైర్నోగ్రాడ్, ఇవానోపిల్యా వంటి పట్టణాల్లో మరో ఆరుగురు మరణించారని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ఈశాన్య ఖార్కివ్ ప్రాంతంలోని పౌర వర్క్‌షాప్‌పై రష్యన్ డ్రోన్ దాడిలో మరో ముగ్గురు మరణించారని తెలిపారు.