బొద్దింకకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు

బొద్దింకకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు
  • అరుదైన ఆపరేషన్ ​చేసిన రష్యా డాక్టర్లు

పశువులు, పక్షులకు ఆపరేషన్​చేయడం కామన్. కానీ బొద్దింక లాంటి జీవులకు ఆపరేషన్​చేయడమంటే పెద్ద సవాల్. రష్యాలోని వెటర్నరీ డాక్టర్లు ఈ అరుదైన ఆపరేషన్​ను సక్సెస్​ఫుల్​గా కంప్లీట్​చేశారు. ప్రెగ్నెంట్​గా ఉన్న ఒక బొద్దింకకు డెలివరీ సమయంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆపరేషన్​చేసి గర్భసంచిని తొలగించారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ బొద్దింకను ఓ యజమాని పెంచుకుంటున్నాడు. అది పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన వెటర్నరీ క్లినిక్​కు​తీసుకెళ్లాడు. పరిశీలించిన డాక్టర్లు బొద్దింక గర్భసంచి బయటకు వచ్చిందని గుర్తించారు. ఆపరేషన్​ చేయకపోతే బతకడం కష్టమవుతుందని నిర్ధారించారు. వెంటనే మూడు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఆపరేషన్ ​స్టార్ట్​చేశారు. కాంప్లికేటెడ్​అయిన ఈ సర్జరీని సవాల్​గా తీసుకొని విజయవంతంగా పూర్తి చేశారు. బొద్దింక శరీరంలోని ఎగ్​పౌచ్​ను తొలగించి దానికి ప్రాణం పోశారు. డాక్టర్లు ఈ వీడియోను రష్యన్ ​సోషల్​మీడియా ప్లాట్​ఫామ్​‘‘వీకే’’లో పోస్ట్​చేయడంతో వైరల్​అయింది. ‘‘ఆపరేషన్​విజయవంతమైంది. ఇక బొద్దింక ఆరోగ్యంగా ఉంటుంది” అని పేర్కొన్నారు. ఎగ్​ పౌచ్​ను తొలగించకపోయింటే ఇన్​ఫెక్షన్స్​వచ్చి బొద్దింక ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు. ఈ బొద్దింక ఆర్చిమంద్రిత జాతికి చెందినది. ఇవి సౌత్​అమెరికాలోని అడవుల్లో ఉంటాయి. 8 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి.