టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కు శ్రీలంక సిరీస్ లో చోటు దక్కలేదు. జింబాబ్వే సిరీస్ లో అదరగొట్టినా గైక్వాడ్ కు ఛాన్స్ దక్కపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సిరీస్ లో 66 యావరేజ్ తో 133 పరుగులు చేసినా ఈ యువ బ్యాటర్ ను సెలక్టర్లు కరుణించలేదు. గైక్వాడ్ చివరి 7 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్ లో 71 యావరేజ్ తో పరుగులు చేశాడు. ఇందులో గత ఏడాది ఆస్ట్రేలియాపై చేసిన ఒక సెంచరీ కూడా ఉంది. అయితే గైక్వాడ్ బదులు జట్టులో అనూహ్యంగా పరాగ్ కు కు స్థానం కలగడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
Also Read:-ఇండియా X పాకిస్తాన్..నేటి నుంచి విమెన్స్ ఆసియా కప్
ఐపీఎల్ తో పాటు విజయ్ హజారే ట్రోఫీలో రియాన్ పరాగ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్ అనుభవంలోనూ.. గణాంకాల పరంగా చూసుకుంటే గైక్వాడ్ ముందు వరుసలో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే జరిగిన జింబాబ్వే టూర్ లో పరాగ్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఒక మ్యాచ్ లో 2 పరుగులు.. మరో మ్యాచ్ లో 22 పరుగులు చేసి విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో గైక్వాడ్ ను పక్కనపెట్టి మరీ పరాగ్ కు ఛాన్స్ ఇవ్వడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది.
బీసీసీఐ.. సెలక్టర్లు పరాగ్ ను నమ్మడంలో ఆశ్చర్యం లేకపోయినా గైక్వాడ్ కు మాత్రం స్థానం దక్కాల్సిందే అంటున్నారు నెటిజన్స్. అతడికి బీసీసీఐ అన్యాయం చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. శ్రీలంకతో జరగనున్న మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లకు ఇండియా టీమ్‌ను గురువారం (జూలై 18) ప్రకటించారు. బిగ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్‌ను టీ20లకు కెప్టెన్‌గా నియమించారు. వన్డేలకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. విరాట్ కోహ్లీకి కూడా వన్డే టీమ్‌లో చోటు దక్కింది. రెండు ఫార్మాట్లకు శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.
Ruturaj gaikwad #ruturajgaikwad pic.twitter.com/n3YRY1nkqK
— RVCJ Sports (@RVCJ_Sports) July 18, 2024