PBKS vs CSK: ఫినిషింగ్‌కు పనికిరాడు: కాన్వే రిటైర్డ్ ఔట్‌కు కారణం చెప్పిన గైక్వాడ్!

PBKS vs CSK: ఫినిషింగ్‌కు పనికిరాడు: కాన్వే రిటైర్డ్ ఔట్‌కు కారణం చెప్పిన గైక్వాడ్!

ఐపీఎల్ 2025లో మరో రిటైర్డ్ ఔట్ హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం (ఏప్రిల్ 8) చండీఘర్ లోని ముల్లన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదికగా చెన్నై సూపర కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఛేజింగ్ లో చెన్నై తడబడింది. ఓపెనర్లు అదరగొట్టినా.. గైక్వాడ్ ఔట్ ఒక పరుగుకే ఔట్ కావడంతో సూపర్ కింగ్స్ ఒత్తిడిలో పడింది. ఒక ఎండ్ లో కాన్వే మాత్రం పోరాడుతూనే ఉన్నాడు. 

హాఫ్ సెంచరీతో జట్టు విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. జట్టును గెలిపించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో కాన్వే వేగంగా ఆడడంలో విఫలమయ్యాడు. కొట్టాల్సిన రన్ రేట్ పెరిగిపోతున్నా బ్యాట్ ఝుళిపించడంలో విఫలమయ్యాడు. చివరి వరకు ఔట్ కాకుండా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కాన్వే.. 69 పరుగులు చేయడానికి 49 బంతులు తీసుకున్నాడు. చివరి 13 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన దశలో చెన్నై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెనర్ కాన్వేను రిటైర్డ్ ఔట్ చేసి అతని స్థానంలో జడేజాను బ్యాటింగ్ కు పంపింది.

►ALSO READ | PBKS vs CSK: క్రమశిక్షణ తప్పిన మ్యాక్స్ వెల్.. బీసీసీఐ బిగ్ పనిష్మెంట్

కాన్వేలాంటి స్టార్ బ్యాటర్ ను రిటైర్డ్ ఔట్ చేయడం కొంచెం షాకింగ్ గా అనిపించింది. అయితే మ్యాచ్ తర్వాత కాన్వే రిటైర్డ్ ఔట్ పై గైక్వాడ్ క్లారిటీ ఇచ్చాడు. " మేము విజయానికి కొంచెం దూరంలో ఆగిపోయాము. కాన్వే టైమింగ్ ప్లేయర్. అతను టాపార్డర్ లో మాకు చాలా  కీలకం. చివరి ఓవర్లలో జడేజా పాత్ర పూర్తి భిన్నం. కాన్వే క్రీజ్ లో ఇబ్బంది పడుతున్నాడు. అతనికి చాలా సమయం ఇచ్చాము. ఆ తర్వాత అతని స్థానంలో జడేజాను పంపాలనుకున్నాం". అని గైక్వాడ్ మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో అశ్విన్, సాయి సుదర్శన్, అథర్వ టైడ్, తిలక్ వర్మ తర్వాత రిటైర్డ్ ఔట్ అయిన ఐదో ప్లేయర్ గా కాన్వే నిలిచాడు. 

మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పంజాబ్‌‌‌‌‌‌‌‌ 18  రన్స్ తేడాతో సీఎస్కేను ఓడించి మూడో విజయం అందుకుంది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 219/6 స్కోరు చేసింది. ఆర్యకు తోడు శశాంక్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (36 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 నాటౌట్‌‌‌‌‌‌‌‌), మార్కో యాన్సెన్ (19 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 నాటౌట్‌‌‌‌‌‌‌‌) దంచికొట్టారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో సీఎస్కే 20 ఓవర్లలో  201/5  చేసి ఓడింది. డెవాన్ కాన్వే (49 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69), శివం దూబే (27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42)తో పాటు చివర్లో ఎంఎస్ ధోనీ (12 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 3 సిక్సర్లతో 27) మెరిసినా చెన్నైకి నాలుగో ఓటమి తప్పలేదు.