Ruturaj Gaikwad: ఆస్ట్రేలియాకు గైక్వాడ్.. టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడానికి అదే కారణం

Ruturaj Gaikwad: ఆస్ట్రేలియాకు గైక్వాడ్.. టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడానికి అదే కారణం

టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ బంగ్లాదేశ్ తో జరగబోయే మూడు టీ20 ల సిరీస్ కు చోటు దక్కలేదు. టీ20 క్రికెట్ లో అద్భుత రికార్డ్ ఉన్నా.. జైస్వాల్, శుభ్‌మాన్ గిల్ కు రెస్ట్ ఇచ్చినా.. ఛాన్స్ దక్కపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చివరిసారిగా  జింబాబ్వే సిరీస్ లో 66 యావరేజ్ తో 133 పరుగులు చేసినా ఈ యువ బ్యాటర్ ను శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ కు సెలక్టర్లు సెలక్ట్ చేయలేదు. దీంతో బీసీసీఐ..అతడికి బీసీసీఐ అన్యాయం చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే అతన్ని టీ20లకు ఎంపిక చేయకపోవడానికి కారణం ఏంటో తెలిసింది.

నవంబర్ చివర్లో ఆస్ట్రేలియాతో భారత్ కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. ఈ సిరీస్ కు గైక్వాడ్ ను బ్యాకప్ ఓపెనర్ గా ఉంచుకోవాలని టీమిండియా యాజమాన్యం భావిస్తోందట. ఈ కారణంగానే గైక్వాడ్ ను బంగ్లాదేశ్ టీ20 సిరీస్ కు ఎంపిక చేయలేదని నివేదికలు చెబుతున్నాయి. ఏదైనా కారణాల వల్ల జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మలలో ఒకరు అందుబాటులో లేకుంటే.. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ గైక్వాడ్ ను వారి స్థానంలో తీసుకోవాలని కోరుతున్నాడట. 

5 మ్యాచ్ ల సుదీర్ఘ టెస్ట్ సిరీస్ లో ఆటగాళ్లు గాయాల పాలయ్యేఅవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో గైక్వాడ్ ను మూడో ఓపెనర్ గా సెలక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఓపెనర్ గా గైక్వాడ్ ను మించిన ఆటగాళ్లు లేరని.. అతను టెస్ట్ క్రికెట్ ఆడుతూనే ఉండాలని బీసీసీఐ వర్గం తెలిపినట్టు కొన్ని నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం గైక్వాడ్ ఇరానీ ట్రోఫీలో రెస్టాఫ్ ఇండియాకు కెప్టెన్సీ చేస్తున్నాడు.