Irani Cup 2024: కెప్టెన్‌గా గైక్వాడ్.. రెస్టాఫ్ ఇండియా జట్టు ప్రకటన

ఇరానీ ట్రోఫీలో భాగంగా రెస్టాఫ్ ఇండియా జట్టును పురుషుల సెలక్షన్ కమిటీ ప్రకటించింది. దులీప్ ట్రోఫీలో ఇండియా సి జట్టుకు కెప్టెన్సీ చేసిన రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ అప్పగించారు. అభిమన్యు ఈశ్వరన్ కు వైస్ కెప్టెన్సీ దక్కింది. ఈ జట్టులో ప్రస్తుతం బంగ్లాదేశ్ తో సిరీస్ కు ఎంపికైన ధృవ్ జురెల్, యష్ దయాల్ కు చోటు దక్కింది. వీరిద్దరికి సెప్టెంబర్ 27 న కాన్పూర్ టెస్టు ప్లేయింగ్ 11 లో చోటు దక్కపోతే ఇరానీ ట్రోఫీ ఆడతారు. 

సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇషాన్ కిషాన్ వికెట్ కీపర్ బాధ్యతలు పంచుకుంటాడు. మానవ్ సుతార్, సరాంశ్ జైన్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, యష్ దయాల్*, రికీ భుయ్, శాశ్వత్ రావత్, ఖలీల్ అహ్మద్ , రాహుల్ చాహర్ మిగిలిన ప్లేయర్లుగా ఎంపికయ్యారు.  లక్నో వేదికగా భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 1 నుంచి 5 వరకు జరుగుతుంది. రంజీ ట్రోఫీ విన్నర్ ముంబైతో ఈ మ్యాచ్ లో రెస్టాఫ్ ఇండియా తలబడుతుంది.

ALSO READ | Alasdair Evans: అంతర్జాతీయ క్రికెట్‌కు స్కాట్లాండ్ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్

మరోవైపు ముంబై జట్టును రంజీ ట్రోఫీ విజేతగా నిలిపిన రహానే ఇరానీ కప్ లోనూ ముంబైకు కెప్టెన్ గా కొనసాగనున్నాడు. శ్రేయాస్ అయ్యర్, ముషీర్ ఖాన్, షామ్స్ ములానీ , తనుష్ కొటియన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఈ మ్యాచ్ లో ఆడనున్నారు. ప్రస్తుతం భారత జట్టు స్క్వాడ్ లో ఉన్న సర్ఫరాజ్ ఇరానీ కప్ కోసం కాన్పూర్ నుండి లక్నోకు వెళ్లే అవకాశముంది.ముంబై చివరిసారిగా 1998 లో ఇరానీ కప్ ను అందుకుంది. ఈ సారి స్టార్ ప్లేయర్లు అందరూ అందుబాటులో ఉండడంతో ముంబై టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.