IND Vs BAN 2024: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్.. గైక్వాడ్‌కు మరోసారి అన్యాయం

టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కు మరోసారి నిరాశ తప్పలేదు. అతనికి బంగ్లాదేశ్ తో జరగబోయే మూడు టీ20 ల సిరీస్ కు చోటు దక్కలేదు. టీ20 క్రికెట్ లో అద్భుత రికార్డ్ ఉన్నా.. గైక్వాడ్ కు ఛాన్స్ దక్కపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చివరిసారిగా  జింబాబ్వే సిరీస్ లో 66 యావరేజ్ తో 133 పరుగులు చేసినా ఈ యువ బ్యాటర్ ను సెలక్టర్లు కరుణించలేదు.దీంతో బీసీసీఐ..అతడికి బీసీసీఐ అన్యాయం చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. 

గైక్వాడ్ చివరి 7 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్ లో 71 యావరేజ్ తో పరుగులు చేశాడు. ఇందులో గత ఏడాది ఆస్ట్రేలియాపై చేసిన ఒక సెంచరీ కూడా ఉంది. అంతకముందు శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్ కు గైక్వాడ్ కు స్థానం దక్కలేదు. ప్రస్తుతం గైక్వాడ్ ఇరానీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతను రెస్టాఫ్ ఇండియాకు కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇటీవలే దులీప్ ట్రోఫీలో ఇండియా సి తరపున కెప్టెన్సీ చేసి ఆకట్టుకున్నాడు.   

Also Read:-విదేశీ క్రికెటర్లపై కొరడా.. అలా చేస్తే రెండేళ్ల బ్యాన్

బంగ్లాదేశ్‌‌‌‌తో మూడు టీ20ల సిరీస్‌‌‌‌కు శనివారం (సెప్టెంబర్ 29) జట్టును ప్రకటించారు. సూర్యకుమార్‌‌‌‌ కెప్టెన్సీలో మొత్తం 15 మందితో కూడిన టీమ్‌‌‌‌ను ఎంపిక చేశారు. స్పీడ్‌‌‌‌తో బౌలింగ్ చేసిన మయాంక్‌‌‌‌ యాదవ్‌‌‌‌కు తొలిసారి పిలుపు అందింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడేండ్ల తర్వాత నేషనల్‌‌ టీమ్‌‌లోకి వచ్చాడు. అక్టోబర్‌‌‌‌ 6, 9, 12న వరుసగా గ్వాలియర్‌‌‌‌, ఢిల్లీ, హైదరాబాద్‌‌‌‌లో మ్యాచ్‌‌‌‌లు జరగనున్నాయి.  

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు:

సూర్యకుమార్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), అభిషేక్‌‌‌‌ శర్మ, శాంసన్‌‌‌‌, రింకూ సింగ్‌‌‌‌, పాండ్యా, పరాగ్‌‌‌‌, నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌, శివం దూబే, సుందర్‌‌‌‌, బిష్ణోయ్‌‌‌‌, వరుణ్‌‌‌‌ చక్రవర్తి, జితేష్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌, హర్షిత్‌‌‌‌ రాణా, మయాంక్‌‌‌‌ యాదవ్‌‌‌‌.