MS Dhoni: 51 ఏళ్ళ వరకు ఆడతాడు.. ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

MS Dhoni: 51 ఏళ్ళ వరకు ఆడతాడు.. ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై  గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్ టోర్నీ మొదలైనా, ముగుస్తున్నా మహేంద్ర సింగ్ రిటైర్మెంట్ గురుంచి వార్తలు రావడం సహజమే. గత రెండేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. మహేంద్రుడు సైతం తన వీడ్కోలు గురించి ఎటూ తేల్చక కాలయాపన చేస్తున్నాడు. భారత క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఐపీఎల్ లో కొనసాగుతూనే ఉన్నాడు. ధోనీ తన రిటైర్మెంట్ గురించి హింట్ ఇవ్వకపోగా.. ఇంకొన్ని సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడనున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే ధోనీ మాటలను బట్టి చూస్తే అలాగే అనిపిస్తుంది. ఓపిక ఉన్నంత కాలం చెన్నై ఫ్రాంచైజీకి ఆడతానని చెప్పకనే చెప్పాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గైక్వాడ్ ధోనీ రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు. 

ALSO READ | CSK vs MI: పోలీస్ వాహనంలో డై హార్డ్ ఫ్యాన్.. కోహ్లీ పాదాలు తాకిన అభిమాని అరెస్ట్

సొంతగడ్డపై ముంబైతో మ్యాచ్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ధోనీ 51 ఏళ్ళ వరకు క్రికెట్ ఆడొచ్చని చెప్పుకొచ్చాడు. దీనికి ఇటీవలే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ను ఉదాహరణగా సూచించాడు. " 51 ఏళ్ళైనా సచిన్ టెండూల్కర్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి ధోనీ భాయ్ కు కూడా ఇంకా చాలా సంవత్సరాలు ఆడతాడని నేను అనుకుంటున్నాను" అని గైక్వాడ్ తెలిపాడు. గైక్వాడ్ మాటలను బట్టి చూస్తే 2025 ఐపీఎల్ సీజన్ ధోనీ కూడా 50 ఏళ్ళ వరకు ఆడతాడేమో అన్నట్టు మాట్లాడాడు. అదే జరిగితే ధోనీకి ఇదే చివరి సీజన్ కాదని తెలుస్తుంది.   

43 ఏళ్ళ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ కు సిద్ధమవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో తన అనుబంధాన్ని పెంచుకుంటున్నాడు. గత సీజన్ లో చివర్లో వచ్చి మెరుపులు మెరిపించి మహేంద్రుడు ఈ సారి ముందుగా బ్యాటింగ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2024 సీజన్‌ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుండి వైదొలిగిన ధోనీ సీజన్ మధ్యలో మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఈ సీజన్ లో చెన్నై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైనప్పటికీ ధోని తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ లో ఈ మాజీ కెప్టెన్ మొత్తం 73 బంతుల్లో 14 ఫోర్లు, 13 సిక్సర్లతో 161 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్‌ 220.55 గా ఉండడం విశేషం.