పెళ్లంటే నరకమని.. భార్య అంటే గయ్యాలదని అని భావించే మగవారు మన సమాజంలో బోలెడు మంది. పెళ్లి చేసుకుని తమ జీవితాలను ఏదో త్యాగం చేసినట్లు ఫీలయ్యే మగాళ్లు కోకొల్లు. అయితే వివాహ బంధంలో భార్యకు సమాన విలువ ఇస్తూ.. ఆమె లేకపోతే తన జీవిత ప్రయాణం సాగదనే సత్యాన్ని ఒప్పుకునే మగాళ్లు కొందరు మాత్రమే. ఆ జాబితాలోకి క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ చేరాడు. పెళ్లైన తర్వాత తొలి మ్యాచ్ ఆడిన రుతురాజ్.. భార్య జెర్సీని ఒంటిపై ధరించి తన జీవితంలో ఆమె స్థానం ఏంటో చెప్పకనే చెప్పాడు. అంతేకాదండోయ్.. అది ఒంటిపై ఉన్నందుకో ఏమో గ్రౌండ్‌లో చెలరేగిపోయాడు.
మహరాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో పుణెరి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రుతురాజ్ తొలి మ్యాచులోనే వీరవిహారం చేశాడు. కొల్హాపూర్ టస్కర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 27 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన టస్కర్స్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 144 పరుగులు చేయగా.. పుణెరి ఆ లక్ష్యాన్ని 14 ఓవర్లలోనే చేధించింది. పుణేరి బ్యాట్లర్లలో రుతురాజ్ 64 పరుగులు చేయగా, పవన్ షా 57 పరుగులు చేశాడు.
Ruturaj Gaikwad at his very best in the MPL. pic.twitter.com/sXlZ72HTRY
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 15, 2023
ఇక, పెళ్లి కారణంగా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు దూరమైన రుతురాజ్.. వెస్టిండీస్ టూర్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కొన్ని మ్యాచుల్లో విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అదే జరిగితే ఋతురాజ్‌కు జట్టులో స్థానం దక్కినట్లే. అయితే అతనికి యశస్వి జైస్వాల్ నుంచి పోటీ ఎదురవుతోంది. మరో ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
Ruturaj Gaikwad was seen wearing jersey no 13 which is same of his wife Utkarsh
— Muffadal Vohra (@_mufadal_vohra_) June 15, 2023
What a lovely couple pic.twitter.com/VolCAePu9Q