Duleep Trophy 2024: వారెవ్వా గైక్వాడ్.. సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్

Duleep Trophy 2024: వారెవ్వా గైక్వాడ్.. సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్

క్రికెట్ లో గ్రేట్ క్యాచులు అందుకోవడం ఒకప్పుడు అరుదుగా చూసేవాళ్ళం. కానీ టీ20 లీగ్ లు ఎక్కువైన తరుణంలో ఒక్క క్యాచ్ మ్యాచ్ ని డిసైడ్ చేసేస్తోంది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ మీదే కాదు ఫీల్డింగ్ మీద కూడా ప్లేయర్లు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నమ్మశక్యం కానీ రీతిలో క్యాచులు అందుకుంటూ అభిమానులని థ్రిల్ కి గురి చేశారు. 

ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ లాంటి మెగా టోర్నీలో ఒకదానికి మించి మరో క్యాచ్ ని అందుకుంటూ ఆడియన్స్ కి కిక్ ఇస్తోనే ఉన్నారు.తాజాగా అలాంటి క్యాచ్ ఒకటి దులీప్ ట్రోఫీలో నమోదయింది. ఇండియా ఏ.. ఇండియా సి మధ్య జరిగిన మ్యాచ్ లో గైక్వాడ్ నమ్మశక్యం కానీ రీతిలో క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు. పరాగ్ కవర్స్ దిశగా ముందుకొచ్చి గట్టిగా షాట్ ఆడాడు. ఈ క్యాచ్ ను గైక్వాడ్ కవర్స్ లో పరిగెడుతూ సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ అందుకొని షాక్ కు గురి చేశాడు. ప్రస్తుతం ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ రావత్ సెంచరీ (124) తో 297 పరుగులకు ఆలౌటైంది. బదులుగా ఇండియా సి మొదటి ఇన్నింగ్స్ లో 234 పరుగులు మాత్రమే చేయగలిగింది. 82 పరుగులతో అభిషేక్ పోరెల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.   అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన 286 పరుగులకు ఆలౌటైంది. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా సి ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.