
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి బదిలీ అయ్యారు. కొత్త కమిషనర్గా ఆర్వీ కర్ణన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇలంబరితి ఆరునెలల పాటు మాత్రమే కమిషనర్గా పని చేసినప్పటికీ తనదైన మార్క్ వేశారు. ప్రధానంగా జీహెచ్ఎంసీని ఆదాయం వైపు పరుగులు తీసే విషయంలో కీలకంగా వ్యవహరించారు.
]పనులు చేయకుండా బిల్లులు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్ల బిల్లులపై విచారణ జరిపించారు. కొత్తగా అప్పులు చేయకపోవడంతో పాటు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చారు. అధికారుల అవినీతి అక్రమాలపై విజిలెన్స్, ఇంటెలిజెన్స్ విచారణకు ఆదేశించారు. స్ట్రీట్ లైట్ల మెయింటెనెన్స్‌కు కొత్త విధానం తీసుకొచ్చారు. ప్రజావాణి ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు ఆరా తీయడంతో పాటు పెండింగ్‌లో ఉంటే సంబంధిత అధికారులను వివరణ కోరి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేవారు.
ప్రస్తుతం ఆయనను హెచ్‌ఎండీఏ పరిధిలో పట్టణాభివృద్ధి కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. 2012 బ్యాచ్‌కు చెందిన ఆర్వీ కర్ణన్ నిన్నటి వరకు హెల్త్అండ్ ఫ్యామిలీ వెల్ఫెర్డైరెక్టర్గా పనిచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని హోటళ్లలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించి, తనదైన మార్క్చూపించారు.