ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి ఆర్వీ కర్ణన్
తిమ్మాపూర్ వెలుగు: సమగ్ర కుటుంబ సర్వేను గడువులోగా పూర్తి చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్‌లో సర్వే తీరును సోమవారం ఆయన కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పరిశీలించారు. సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లతో మాట్లాడారు.
కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నప్పుడే సర్వే చేయాలన్నారు. ఓ కుటుంబ యజమానితో మాట్లాడుతూ సర్వే కేవలం కుల గణనకు మాత్రమే కాదనీ, ఎన్నో సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, మెప్మా పీడీ స్వరూపారాణి పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
శంకరపట్నం, వెలుగు: శంకరపట్నం మండలం కేశవపట్నం వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ప్రత్యేక అధికారి ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ఇప్పటివరకు జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను పౌరసరఫరాల అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, ప్రఫుల్‌దేశాయ్, సివిల్ సప్లై డీఎం రజినీకాంత్, డీఏవో భాగ్యలక్ష్మి, డీసీవో రామానుజచారి, ఏవో వెంకటేశ్, డీసీఎస్‌వో నర్సింగరావు, తాడికల్ సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు