నిమ్స్​ను సందర్శించిన ఆర్వీ కర్ణన్..ఫైర్ సేఫ్టీ చర్యలపై ఆరా

నిమ్స్​ను సందర్శించిన ఆర్వీ కర్ణన్..ఫైర్ సేఫ్టీ చర్యలపై ఆరా

పంజాగుట్ట, వెలుగు: నిమ్స్​హాస్పిటల్​ను హెల్త్​అండ్​ఫ్యామిలీ వెల్ఫేర్​కమిషనర్​ఆర్వీ కర్ణన్ ఆదివారం సందర్శించారు. హాస్పిటల్ ఐదో అంతస్తు ట్రామా బ్లాక్​లో శనివారం జరిగిన విద్యుత్​షార్ట్​సర్య్కూట్​ప్రాంతాన్ని పరిశీలించారు. హాస్పిటల్లో తీసుకుంటున్న ఫైర్ సేఫ్టీ చర్యలపై నిమ్స్​డైరెక్టర్ డాక్టర్ బీరప్పను అడిగి తెలుసుకున్నారు. నిరంతరం విద్యుత్​సరఫరా జరుగుతున్న ఎలక్ట్రికల్​ప్యానల్​బోర్డుల స్థితిగతులను పరిశీలించి, ఆ శాఖ ఇంజినీర్ల నుంచి సమాచారాన్ని సేకరించారు.  ఆయన వెంట ప్రొఫెసర్​డాక్టర్​గంగాధర్, అడిషనల్​ప్రొఫెసర్​డాక్టర్​లక్ష్మీభాస్కర్​, ఆర్ఎంఓ డాక్టర్​ సాయినిఖిల్ తదితరులు పాల్గొన్నారు.   

నిమ్స్​లో పటాకులు ఎక్కడా లేవు: ఇన్​స్పెక్టర్​ శోభన్

నిమ్స్ హాస్పిటల్లో తమకు ఎక్కడా పటాకులు దొరకలేదని పంజాగుట్ట ఇన్​స్పెక్టర్​ శోభన్ తెలిపారు. హాస్పిటల్​లో అగ్నిప్రమాదం జరిగిన తర్వాత అక్కడి ఓ గదిలో పటాకులు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై నిమ్స్​అడిషనల్​సూపరింటెండెంట్​డాక్టర్ లక్ష్మీభాస్కర్​ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తమకు ఆరోగ్యశ్రీ గదిలో ఎటువంటి  పటాకులు  దొరకలేదని ఇన్​స్పెక్టర్​ శోభన్​ తెలిపారు.