బయటికి ఎందుకు పంపిస్తున్నారు..? డాక్టర్లపై ఆర్వీ కర్ణన్ ఫైర్

 బయటికి ఎందుకు పంపిస్తున్నారు..? డాక్టర్లపై ఆర్వీ కర్ణన్ ఫైర్

గచ్చిబౌలి/ఎల్బీనగర్, వెలుగు: కొండాపూర్ ఏరియా హాస్పిటల్‎ను స్టేట్​హెల్త్ అండ్​ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనరల్, ప్రసూతి, గైనకాలజిస్ట్,​ ఓపీ, చిన్న పిల్లల వార్డులను పరిశీలించారు. వైరల్​ఫీవర్లతో అడ్మిట్​అయిన పేషెంట్లతో మాట్లాడారు. హాస్పిటల్​సూపరింటెండెంట్, ఆర్ఎంఓలను అడిగి బ్లడ్​బ్యాంక్​, టి-హబ్​వివరాలను  తెలుసుకున్నారు. ఫీవర్​తో గురువారం రాత్రి అడ్మిట్ అయిన పేషెంట్​ను టెస్టుల కోసం హాస్పిటల్​బయటికి పంపించడంపై కర్ణన్​మండిపడ్డారు. 

డాక్టర్లను మందలించాడు. డెంగ్యూ పేషంట్లను బయటికి పంపించడమేమిటని నిలదీశారు. టెస్టింగ్​కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. టెస్టుల కోసం వచ్చిన పేషెంట్లను క్యూలో నిలబెట్టడంపై సీరియస్​అయ్యారు. కమిషనర్​వెంట డీసీహెచ్ఎస్​ రాజుయాదవ్​, డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ అనురాగినిరెడ్డి, ఆర్.ఎం.ఓ, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎల్బీనగర్: హయత్‌‌నగర్, ఘట్‌‌కేసర్‌‌‌‌ప్రభుత్వ దవాఖానాలను డీఎంఈ డాక్టర్ ఎం.వాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్లతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. డెంగ్యూ టెస్టులు చేయడంలో నిర్లక్ష్యం వహించొద్దని డాక్టర్లను హెచ్చరించారు. హయత్​నగర్​హాస్పిటల్‎లో వైరల్​ఫీవర్ పేషెంట్ల మధ్య బాలింతను, ఆమె బిడ్డను ఉంచడంపై మండిపడ్డారు. వెంటనే అక్కడి నుంచి షిప్ట్ చేయాలని ఆదేశించారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్​కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ శుక్రవారం సందర్శించారు.