ఈ దఫా నుంచే పోడు భూములకు రైతుబంధు : మంత్రి కేటీఆర్​

సిరిసిల్ల: ఈ దఫా నుంచే పోడు భూములకు రైతుబంధు, రైతు బీమా ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో 1,650 మందికి పోడుపట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ‘కుమురం భీం నినాదం జల్, జంగిల్, జమీన్ ను సాకారం చేస్తున్నం. దళితులను ధనికులు చేసేందుకే దళితబంధు తీసుకొచ్చాం.  భవిష్యత్తులో భూ హద్దుల విషయంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పకడ్బందీగా అటవీ యాజమాన్య హక్కులు రూపొందిస్తామని కేటీఆర్​తెలిపారు