మాకూ గాయాలైనయ్​

నల్గొండ అర్బన్‌, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్​ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి, ఇతర నాయకులపైకి రాళ్లు రువ్వింది బీజేపీ నేతలనేనని రైతుబంధు రాష్ర్ట అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఆరోపించారు. బుధవారం కనగల్ మండల పరిధిలోని జి.ఎడవల్లిలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్​రెడ్డి, కంచర్ల భూపాల్​రెడ్డితో కలిసి మాట్లాడారు. ‘పలివెలకు మేం వస్తాం. మీరూ రండి. మీడియా విజువల్స్​చూసి ఎవరు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకుందాం’ అని అన్నారు. మొత్తం 30 మంది టీఆర్ఎస్​ నాయకులు గాయపడ్డారన్నారు. బీజేపీ నేతలెవరైనా గాయపడ్డారా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్​పీఏ నరేశ్​కూడా రాళ్లు రువ్వాడన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్​కు, పోలీసులకు ఫిర్యాదు చేశామని, వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్​చేశారు. ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి మాట్లాడుతూ పలివెలలో ఈటల రాజేందర్​అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్​రెడ్డి, నల్లగొండ మున్సిపల్​చైర్మన్​ మందడి సైదిరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, రావుల శ్రీనివాస్​రెడ్డి, యుగంధర్​రెడ్డి ఉన్నారు.