= 4,41,911 మంది అకౌంట్లలో 593 కోట్లు జమ
= ఎకరాకు రూ. 6 వేల చొప్పున వేసిన సర్కారు
= డబ్బు జమైనట్టు కర్షకులకు మెస్సేజ్ లు
= నిన్న పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
= 9,48,333 ఎకరాల భూమికి పెట్టుబడి సాయం
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకం ప్రారంభమైంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం నుంచి రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ. 6 వేల చొప్పున పెట్టుబడి సాయం జమవుతోంది. ఇవాళ 9,48,333 ఎకరాల భూమికి సంబంధించి 4,41,911 మంది అకౌంట్లలో 593 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు తమ సెల్ ఫోన్ మెస్సేజ్ లు చెక్ చేసుకుంటూ గడిపారు.
మధ్యాహ్నం తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయని రైతులు తెలిపారు. రైతు భరోసా నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున మొదట విడుదల చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రెవెన్యూ గ్రామాల ఆధారంగా రైతు భరోసా డబ్బులు జమయ్యాయి. కొన్ని మండలాల్లో పంచాయతీ పరిధిలో రెండు మూడు రెవెన్యూ గ్రామాలు ఉండటం వల్ల గ్రామాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుందని ఆయన వివరించారు.
జిల్లా మండలాల సంఖ్య గ్రామాలు రైతులు రైతుభరోసా (రూ. కోట్లలో)
ఆదిలాబాద్ 17 21 6,411 14.49
భద్రాద్రి 23 25 22,242 39.07
హన్మకొండ 12 12 12,545 14.30
జగిత్యాల 20 20 22,242 39.07
జనగామ 12 12 12,320 15.91
జయశంకర్ 12 12 7,073 8.67
గద్వాల 13 13 7,829 12.47
కామారెడ్డి 22 24 9,062 8.35
కరీంనగర్ 15 15 14,226 15.96
ఖమ్మం 21 21 20,802 28.42
కుమ్రంభీం 15 19 4,344 8.62
మహబూబాబాద్ 18 19 14,611 18.14
మమబూబ్ నగర్ 16 16 14,575 17.27
మంచిర్యాల 16 17 7,143 8.72
మెదక్ 21 21 14,833 14.06
మేడ్చల్ 05 05 2,706 3.14
ములుగు 09 09 6,678 8.26
నాగర్ కర్నూల్ 20 20 16,806 23.05
నల్లగొండ 31 31 35,568 46.93
నారాయణపేట 13 13 9,348 13.87
నిర్మల్ 18 18 7,912 10.56
నిజామాబాద్ 31 31 35,568 46.93
పెద్దపల్లి 13 13 9,885 10.14
సిరిసిల్ల 12 12 9,724 12.26
రంగారెడ్డి 21 21 15,597 20.32
సంగారెడ్డి 25 25 19,933 24.15
సిద్దిపేట 26 26 31,170 36.76
సూర్యాపేట 23 23 29,352 37.84
వికారాబాద్ 20 20 8,609 11.18
వనపర్తి 15 15 9,441 12.25
వరంగల్ 11 11 11,386 12.86
యాదాద్రి 17 17 17,576 26.95