మేడిపల్లి, వెలుగు: పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని మేడ్చల్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి సామ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బోడుప్పల్ కార్పొరేషన్ లోని దేవేందర్ నగర్ కాలనీలో రైతు సంఘం మహాసభ జరిగింది. దీంట్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ... కౌలు రైతులను గుర్తించి కార్డులు ఇవ్వాలని, రైతు భరోసా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా వర్తింపజేయాలని, ఇందుకు 2011 చట్టం అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.
రూ. 2 లక్షల రుణమాఫీ చేసి, కొత్త బ్యాంకు రుణాలు రైతులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. రైతు సంఘం మండల అధ్యక్షుడు ఉప్పల కొమరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నిమ్మల నరసింహ, గౌరవ అధ్యక్షుడు సి.ఎస్.దశరథ, సహాయ కార్యదర్శులు డి. జంగయ్య, సీపీఐ మేడిపల్లి మండల కార్యదర్శి రచ్చ కిషన్ పాల్గొని మాట్లాడారు.