నకిలీ విత్తనాలను అరికడదాం..సీడ్ కంపెనీలకు రైతు కమిషన్ పిలుపు

హైదరాబాద్, వెలుగు: నకిలీ విత్తనాలను అరికట్టడంలో సీడ్ కంపెనీలు భాగస్వామ్యం కావాలని  రైతు కమిషన్​ పిలుపునిచ్చింది. శుక్రవారం రాష్ట్రంలోని సీడ్ కంపెనీల ప్రతినిధులతో రైతు కమిషన్ సమావేశమైంది.  రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కమిషన్​సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని, వరితోపాటు ఇతర పంటల విత్తనాల విషయంలోనూ  సీడ్ కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర సర్కారు వరిలో సన్న రకాలకు బోనస్ ఇవ్వడంతో రైతులు వరిసాగు విస్తీర్ణం పెంచారని తెలిపారు. ఈ సందర్భంగా సీడ్ కంపెనీలు విత్తన తయారీలో ఎదురవుతున్న సవాళ్లను కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు.