Rythu Runa Mafi: రైతుల రుణమాఫీకి అంతా సిద్ధం.. ఏ జిల్లాలో ఎంత మంది రైతులున్నారంటే..

Rythu Runa Mafi:  రైతుల రుణమాఫీకి అంతా సిద్ధం.. ఏ జిల్లాలో ఎంత మంది రైతులున్నారంటే..

హైదరాబాద్: తెలంగాణలో రైతు రుణ మాఫీకి వేళయింది. మొదటి విడతగా గురువారం (జులై 18, 2024) సాయంత్రం 4 గంటల లోపు లక్ష రూపాయలు అప్పు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రూ. రెండు లక్షలు ఉన్నోళ్లకు ఆగస్ట్ 15 లోపు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మూడు విడతల్లో దాదాపు రూ.31వేల కోట్ల రైతు రుణ మాఫీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది. రూ. లక్షన్నరలోపు రుణాలు ఉన్న రైతులకు రెండో విడతలో భాగంగా ఈ నెలాఖరులోగా మాఫీ చేస్తామని, రూ. రెండు లక్షల వరకూ అప్పు ఉన్న రైతులకు మూడో విడతలో భాగంగా ఆగస్ట్ 15 లోపు మాఫీ చేస్తామని, దీంతో రుణ మాఫీ ప్రక్రియ ముగుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

తొలి విడత రుణమాఫీ లబ్ధిదారులు జిల్లాల వారీగా:

నల్గొండ 83,124

సిద్ధిపేట 53,137

సూర్యాపేట 56,274

సంగారెడ్డి 51, 167

నాగర్ కర్నూల్ 47,750

ఖమ్మం 59,172

వికారాబాద్ 47, 048

రంగారెడ్డి 49,961

మెదక్ 48,864

కామారెడ్డి 50,097

కరీంనగర్ 31,106

నారాయణపేట 28,684

మహబూబాబాద్ 28,585

వనపర్తి 29,613

మంచిర్యాల 29,421

జనగాం 26,496

పెద్దపల్లి 29,725

హన్మకొండ 26,369

జోగులాంబ గద్వాల్ 24,398

రాజన్న సిరిసిల్ల 23,986

వరంగల్ 23,396

కొత్తగూడెం 28,019

ఆసిఫాబాద్ 22,000

ఆదిలాబాద్ 18,821

భూపాలపల్లి 17,054

నిజామాబాద్ 44469

మహబూబ్ నగర్ 39380

జగిత్యాల 39269

యాదాద్రి భువనగిరి 37285

నిర్మల్ 30106

ములుగు 12997

మేడ్చల్ మల్కాజ్గిరి 2781