ములుగు, వెలుగు : ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు వర్తింపజేయాలని రైతు సంఘం నాయకులు గుండెబోయిన రవిగౌడ్ డిమాండ్ చేశారు. ములుగు మండలంలోని సర్వాపూర్ బొగ్గులవాగులో మంగళవారం మంగళవారం జలదీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ భూమి ఉండి పట్టా లేని రైతులకు వెంటనే పట్టాలు ఇప్పించాలని, రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో రైతు బంధు కారణంగా బడాబాబుల జేబులు నిండాయని విమర్శించారు. భూమిలేని పేదలను గుర్తించి గ్రామసభల ద్వారా రూ.12 వేలు అందించాలని కోరారు. బిక్కినేని కొండల్‌రావు, తిరుపతి, శ్రీనివాస్, గుండెమీది వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.