కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత

కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో మంగళవారం(డిసెంబర్ 10, 2024) ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుదీర్ఘ కాలం ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు. 1999--2004 వరకు కర్నాటక సీఎంగా ఆయన పనిచేశారు. 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్ గా ఆయన పనిచేశారు.

యూపీఏ ప్రభుత్వంలో 2009 నుంచి అక్టోబర్ 2012 వరకూ ఆయన విదేశాంగ మంత్రిగా సేవలందించారు.  2018లో ఆయన బీజేపీలో చేరారు. బెంగళూరు నగరానికి ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ అనే పేరు రావడంలో ఎస్ఎం కృష్ణ కీలక పాత్ర పోషించారు. మంగళవారం అర్ధరాత్రి 2.30 నుంచి 2.45 మధ్యలో ఆయన కన్నుమూసినట్లు తెలిసింది.2023లో ఆయనను పద్మ విభూషణ్తో సత్కరించారు. ఆరు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగిన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఎస్ఎం కృష్ణ సొంతం.