హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మిగిలిపోయిన లాంగ్వేజీ పండిట్ పోస్టులను అప్‌గ్రేడ్ చేసి వారికి ప్రమోషన్లు ఇవ్వాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్‌యూపీపీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.జగదీశ్, ఎస్.నర్సిములు కోరారు. శుక్రవారం వారు విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశంను కలిసి వినతిపత్రం అందించారు.
ఇప్పటికే 10 వేల మంది లాంగ్వేజీ పండిట్లు, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేసి ప్రమోషన్లు ఇచ్చారని తెలిపారు. ఇంకా 800 పోస్టులను అప్ గ్రేడ్ చేయాల్సి ఉందన్నారు. అనంతరం ఆర్‌యూపీపీ సంఘం రూపొందించిన ‘భాషా పండితుల విజయం’ పుస్తకాన్ని ఆయనకు అందించారు.