ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త చీఫ్‌గా ఎస్ పరమేష్

ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త చీఫ్‌గా ఎస్ పరమేష్

భారత తీర రక్షక దళం ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త చీఫ్‌గా ఎస్ పరమేష్‌ను నియమిస్తున్నట్లు భారత ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈయన అక్టోబరు 15న అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. గత నెలలో పూర్వపు చీఫ్ డిజి రాకేష్ పాల్ గుండెపోటుతో మరణించగా.. పరమేష్‌ ప్రస్తుతం డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ALSO READ | పీఎం గతిశక్తితో వేగంగా అభివృద్ధి: ప్రధాని నరేంద్ర మోదీ

 

కొత్త చీఫ్‌ పరమేష్‌ న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీ విద్యార్థి. ఈయనకు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. భూమిపై, సముద్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. అధునాతన ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ సమర్, ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ విశ్వాస్ట్ వంటి ప్రధాన నౌకలకు నాయకత్వం వహించారు. ఈయన కోస్ట్ గార్డ్ రీజియన్స్ ఈస్ట్, వెస్ట్‌లకూ నాయకత్వం వహించారు. 2018 జులై నుండి 2023 ఆగస్టు వరకు తూర్పు సముద్ర తీరానికి కోస్ట్ గార్డ్ కమాండర్‌గా పనిచేశారు.