ఉద్యమకారులకు గుర్తింపు లేదు: ఎస్ పోశెట్టి

నిజామాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి బీఆర్ఎస్ ​గుర్తింపునివ్వడం లేదని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్ పోశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నిజామాబాద్ ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ఏర్పాటుకు ముందు పార్టీలో చేరిన బిగాల గణేశ్ ​గుప్తాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ప్రారంభం నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించారన్నారు. ముడుపులు చెల్లించిన వారికే పార్టీ పదవులు ఇచ్చారే తప్ప, ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారికి మొండి చేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఉద్యమకారులు ఆదే ప్రవీణ్, ఎడ్ల శేఖర్  పాల్గొన్నారు.