భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దేశ సంపద లూటీ కాకుండా, కార్మిక, కర్షక హక్కుల రక్షణకే ఈ నెల 16న దేశ వ్యాప్త సమ్మె జరుగుతోందని, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సక్సెస్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య, పోతినేని సుదర్శన్ కోరారు. కొత్తగూడెంలోని మంచికంటి భవన్లో మంగళవారం నిర్వహించిన జిల్లా ప్లీనరీలో వారు మాట్లాడారు. బీజేపీ గవర్నమెంట్ దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతోందన్నారు. కార్మిక చట్టాల సవరణలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం కు ఫండ్స్ పెంచాల్సింది పోయి తగ్గించడం దారుణమన్నారు. సమావేశంలో జిల్లా సెక్రటరి అన్నవరపు కనకయ్య, నాయకులు సాయిబాబు,మచ్చ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ALSO READ ;- అంగన్‌వాడీలకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి : కల్లూరి మల్లేశం
వైరా, వెలుగు:- 16న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కోరారు. మంగళవారం వైరా మండలం గోల్లెన్ పాడ్లో ఆ సంఘం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. రైతులపై ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం డ్రోన్స్ ద్వారా టియర్ గ్యాస్ వదలటం పాశవిక చర్య అని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు పాల్గొన్నారు.