కేప్‌టౌన్ : ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న పాకిస్తాన్ వరుసగా రెండో వన్డేలోనూ సౌతాఫ్రికాపై విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సొంతం చేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య సఫారీ జట్టు 81 రన్స్ తేడాతో పాక్ చేతిలో చిత్తయింది. తొలుత పాక్ 49.5 ఓవర్లలో 329 రన్స్ చేసి ఆలౌటైంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (80), బాబర్ ఆజమ్ (73), కమ్రాన్ గులామ్ (63) ఫిఫ్టీలతో సత్తా చాటారు.
మఫాక 4, యాన్సెన్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 248 రన్స్‌కే ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ (97) ఒంటరి పోరాటం జట్టును గట్టెక్కించలేకపోయింది. పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిది 4, నసీమ్ షా 3వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. గులామ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మద్య మూడో, చివరి వన్డే ఆదివారం జరుగుతుంది.