SA20 2025: కెప్టెన్‌గా మార్కరం.. సన్ రైజర్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు వీరే

సౌతాఫ్రికా టీ20 సీజన్ జనవరి 9 నుండి ఫిబ్రవరి 8 వరకు జరుగుతుంది.  ఇప్పటివరకు ఈ లీగ్ రెండు సీజన్ లు జరిగింది. రెండు సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్ టైటిల్ విజేతగా నిలిచింది. తాజాగా ఈ లీగ్ 2025 రిటైన్ లిస్ట్ వచ్చేసింది. ఎప్పటిలాగే మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్,జోబర్గ్ సూపర్ కింగ్స్,పార్ల్ రాయల్స్,MI కేప్ టౌన్,డర్బన్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్ల జాబితాను ప్రకటించారు. ప్రిటోరియా క్యాపిటల్స్ మాత్రం రిటైన్ లిస్ట్ ను ఇంకా ప్రకటించలేదు.

ALSO READ | TNPL 2024: ఓపెనర్ అవతారమెత్తిన అశ్విన్.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థులకు చుక్కలు

సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్  జట్టును రెండు సార్లు విజేతగా నిలిపిన ఐడెన్ మార్క్‌రామ్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. స్టార్ ఆటగాళ్లు  ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్ లాంటి కీలక బౌలర్లతో పాటు.. స్టార్ బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్, టామ్ అబెల్ ను జట్టు రిటైన్ చేసుకుంది. జోబర్గ్ సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ఫాఫ్ డు ప్లెసిస్ , గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెరీరాలతో పాటు జానీ బెయిర్‌స్టో జట్టులో కొనసాగుతారు. MI కేప్ టౌన్ కగిసో రబడా, డెవాల్డ్ బ్రెవిస్‌,రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే లను రిటైన్ చేసుకున్నారు. 

SA20 2025 రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా 

పార్ల్ రాయల్స్:

డేవిడ్ మిల్లర్, లుంగి న్గిడి, జార్న్ ఫోర్టుయిన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, మిచెల్ వాన్ బ్యూరెన్, కోడి యూసుఫ్, కీత్ డడ్జియోన్, న్కాబా పీటర్, క్వేనా మఫాకా మరియు లుయాండ్రే ప్రిటోరియస్.

సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్:

ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, టామ్ అబెల్ (ఓవర్సీస్, ఇంగ్లండ్), జోర్డాన్ హెర్మన్, పాట్రిక్ క్రుగర్, బేయర్స్ స్వాన్‌పోయెల్, సైమన్ హార్మర్, లియామ్ డాసన్ (ఓవర్సీస్, ఇంగ్లాండ్), కాలేబ్ సెలెకా ఆండిలే సిమెలనే.

MI కేప్ టౌన్:

కగిసో రబడ, డెవాల్డ్ బ్రీవిస్, జార్జ్ లిండే, డెలానో పోట్‌గీటర్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, ర్యాన్ రికెల్టన్, థామస్ కబెర్, కానర్ ఎస్టర్‌హుజెన్.

డర్బన్ సూపర్ జెయింట్స్:

కేశవ్ మహారాజ్, హెన్రిచ్ క్లాసెన్, క్వింటన్ డి కాక్, నవీన్-ఉల్-హక్ (ఓవర్సీస్, ఆఫ్ఘనిస్తాన్), మార్కస్ స్టోయినిస్ (ఓవర్సీస్, ఆస్ట్రేలియా), డ్వైన్ ప్రిటోరియస్, నూర్ అహ్మద్ (ఓవర్సీస్, ఆఫ్ఘనిస్తాన్), వియాన్ మల్డర్, మాథ్యూ, ప్రేనెలన్ సుబ్రేయన్, JJ స్మట్స్, జూనియర్ డాలా, జాసన్ స్మిత్, బ్రైస్ పార్సన్స్.

జోబర్గ్ సూపర్ కింగ్స్:

ఫాఫ్ డు ప్లెసిస్, ల్యూస్ డు ప్లూయ్, ఇమ్రాన్ తాహిర్, డేవిడ్ వైస్, మొయిన్ అలీ (ఓవర్సీస్, ఇంగ్లండ్), డోనోవన్ ఫెరీరా, నాండ్రే బర్గర్, సిబోనెలో మఖాన్య, గెరాల్డ్ కోయెట్జీ, మహేశ్ తీక్షణ (ఓవర్సీస్, శ్రీలంక), లిజాద్ విలియమ్స్.