నెల రోజులు అభిమానులను అలరించిన సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్ నేడు (ఫిబ్రవరి 9) జరగనుంది. ఫైనల్లో ఎంఐ కేప్ టౌన్,సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టైటిల్ కోసం తలపడనున్నాయి. రెండుసార్లు ఛాంపియన్ సన్‌రైజర్స్.. వరుసగా మూడో సారి టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు రషీద్ ఖాన్ సారధ్యంలోని కేప్ టౌన్ తొలిసారి టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు జరుగుతుంది. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. బలాబలాలను చూస్తే ముంబై పటిష్టంగా కనిపిస్తుంది.
రెండు జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. కేప్ టౌన్ వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ఫుల్ జోష్ లో ఉంటే.. వరుసగా మూడు ఓటములతో టోర్నీ ప్రారంభించిన సన్ రైజర్స్ అద్భుతంగా పుంజుకొని ఫైనల్లో అడుగుపెట్టింది.
లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ చూడాలంటే..?
ఎంఐ కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మధ్య జరిగే ఫైనల్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. డిస్నీ + హాట్‌స్టార్‌లోనూ ఈ మ్యాచ్ చూడొచ్చు.
ఎంఐ కేప్ టౌన్:
ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, రీజా హెండ్రిక్స్, సెడికుల్లా అటల్, డెవాల్డ్ బ్రెవిస్, డెలానో పోట్‌గీటర్, జార్జ్ లిండే, కార్బిన్ బాష్, రషీద్ ఖాన్ (కెప్టెన్), కగిసో రబడ, ట్రెంట్ బౌల్ట్
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్:
డేవిడ్ బెడింగ్‌హామ్, టోనీ డి జోర్జీ, జోర్డాన్ హెర్మాన్, టామ్ అబెల్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టాన్ స్టబ్స్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, క్రెయిగ్ ఓవర్టన్, లియామ్ డాసన్, ఓట్నీల్ బార్ట్‌మన్, రిచర్డ్ గ్లీసన్