యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సాహో’ విడుదలకు సిద్ధమవుతోంది. మూవీని ఆగస్ట్ 15న విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. చాప్టర్స్, యాక్షన్ సీక్వెన్సులు, ఫస్ట్ లుక్ పోస్టర్లతో క్రేజ్ పెంచేసిన సాహో యూనిట్.. ఇపుడు మరో సర్ ప్రైజ్ ఇస్తోంది. జూన్ 13న సాహో టీజర్ ను విడుదల చేస్తామని ప్రకటించింది.
జూన్ 13న సాహో టీజర్ రిలీజ్ అవుతుండగా… జూన్ 14నుంచి థియేటర్లలోనూ ఆ మోత మోగనుంది. ఈ టీజర్ ను థియేటర్లలోనూ ప్రదర్శిస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
దీంతోపాటు…. శ్రద్ధాకపూర్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. రివాల్వర్ తో పోజిచ్చిన శ్రద్ధా నిలువెత్తు కటౌట్.. ఫ్యాన్స్ గుండెల్లో బాంబులు పేల్చేస్తోంది.
సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీలో తెరకెక్కిన సాహో పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి.