పాకిస్తానీలకు అన్ని వీసాలు రద్దు చేసిన భారత్..ఏప్రిల్ 27నుంచి అమలు

పాకిస్తానీలకు అన్ని వీసాలు రద్దు చేసిన భారత్..ఏప్రిల్ 27నుంచి అమలు

పాకిస్తానీలకు అన్ని వీసాలను భారత్ రద్దు చేసింది. ఏప్రిల్ 27 లోపు దేశం విడిచి వెళ్లాలని డెడ్ లైన్ విధించింది. మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకు చెల్లుబాటులో ఉంటాయని తెలిపింది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత సమావేశమైన సెక్యూరిటీ కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. టూరిస్టులపై దాడులకు పాల్పడిన ఏ ఒక్క టెర్రరిస్టును వదిలిపెట్టమని. వెతికి పట్టి శిక్షిస్తామని ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేశారు. భారతీయులు ఎదరూ పాకిస్తాన్‌కు వెళ్లవద్దని సూచించారు. పాకిస్తాన్‌లో ఉన్నవారు త్వరలో స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేశారు. 

పాకిస్తాన్ జాతీయులు అందరూ దేశం విడిచి వెళ్లాలని కేంద్రం హెచ్చరించింది. వారికి సంబంధించిన అన్ని వీసాలను రద్దు చేసింది. ఇప్పటికే జారీ చేసిన వీసాలు ఏప్రిల్ 27 వరకు చెల్లుబాటు అవుతాయి. ఏప్రిల్ 29న రద్దు చేస్తామని తెలిపింది. పహల్గాం దాడి తర్వాత భద్రతా వ్యవహారాలా కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కొనసాగింపుగా పాకిస్థాన్ జాతీయులకు వీసా సేవలను నిలిపివేయాలని నిర్ణయించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ లో ఉన్న భారతీయులు వీలైనంత వరకు తిరిగి రావాలని సూచించింది. 

Also Read :  సింధు జలాలపై పాకిస్తాన్ కీలక ప్రకటన

అంతకుముందు 26 మంది టూరిస్టుల ప్రాణాలు బలిగొన్న అనాగరిక పహల్గాం ఉగ్రవాద దాడిపూ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గురువారం(ఏప్రిల్ 24)  ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. 28 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి కారణమైన వారిని గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తామని" ప్రతిజ్ఞ చేశారు. దాడి తర్వాత తన మొదటి బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఘటనపై దేశం మొత్తం విచారం వ్యక్తం చేస్తుందన్నారు. నేరస్థులపై నిర్ణయాత్మక చర్యలు ఉంటాయని  హామీ ఇచ్చారు. కలలోకూడా ఊహించని రీతిలో ఉగ్రవాదులపై చర్యలు ఉంటాయని అన్నారు. ఉగ్రవాదం భారతదేశ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదని అన్నారు. ప్రతి ఉగ్రవాదిని,వారికి మద్దతు ఇచ్చేవారిని గుర్తించి, కనిపెట్టి శిక్షిస్తామని చెప్పారు. భారత భూభాగం అంచులదాకా తరమి కొడతామని అన్నారు.