స్వియాటెక్‌ ఓటమి.. ఫైనల్లో సబలెంక

స్వియాటెక్‌ ఓటమి.. ఫైనల్లో సబలెంక

మసాన్‌‌(ఓహియో): సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌‌లో టాప్ ర్యాంకర్  ఇగా స్వైటెక్‌‌కు షాకిస్తూ అరీనా సబలెంక ఫైనల్‌‌కు దూసుకెళ్లింది.  ఆదివారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్ సెమీఫైనల్లో  మూడో ర్యాంకర్ అరీనా సబలెంక 6–3, 6–3తో వరుస సెట్లలో స్వైటెక్‌‌ను చిత్తు చేసింది. దాంతో వరుసగా 15 విజయాలతో జోరు మీదున్న స్వైటెక్‌‌కు బ్రేక్ పడింది. 

మెన్స్‌‌ సింగిల్స్‌‌లో టాప్ సీడ్‌‌ జానిక్ సినర్‌‌‌‌ సెమీస్‌‌ చేరుకున్నాడు.  క్వార్టర్స్‌‌లో సినర్ 4–6, 7–5, 6–4తో ఆరో ర్యాంకర్ ఆండ్రీ రబ్లెవ్‌‌పై విజయం సాధించాడు. దాంతో ఓపెన్ ఎరాలో ఈ టోర్నీ మెన్స్ సింగిల్స్‌‌లో సెమీస్ చేరిన తొలి ఇటాలియన్‌‌గా నిలిచాడు.  సెమీస్‌‌లో అతను మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌‌తో పోటీ పడతాడు. మరో క్వార్టర్స్‌‌లో జ్వెరెవ్ 3–6, 7–6, 7–5తో  బెన్ షెల్టన్‌‌పై విజయం సాధించాడు.

అల్కరాజ్ సారీగైల్‌‌ మోన్‌‌ఫిల్స్‌‌తో ప్రిక్వార్టర్స్‌‌ మ్యాచ్‌‌లో ఓడిపోయిన స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ అభిమానులకు సారీ చెప్పాడు. శుక్రవారం  జరిగిన ఈ పోరు నిరాశ పరిచిన కార్లోస్‌‌ మూడో సెట్‌‌లో పాయింట్‌‌ చేర్చుకున్న తర్వాత అసహనంతో తన రాకెట్‌‌ను నేలకేసి కొట్టి విరగొట్టాడు. అతని ప్రవర్తనపై తర్వాత విమర్శలు వచ్చాయి. దాంతో అల్కరాజ్‌‌ క్షమాపణ కోరాడు.