శబరిమల ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే..

శబరిమల ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే..

స్వామిశరణం అంటూ శబరి గిరులు మారుమోగాయి.  మండల దీక్ష .. మండల పూజల అనంతరం.. శబరిమల ఆలయాన్ని  ట్రావెన్ కోర్ అధికారులు.. ప్రధాన తంత్రి ఆధ్వర్యంలో మూసివేశారు.  తిరిగి మకర విళక్కు పూజల కోసం  డిసెంబరు 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. 

ప్రధాన  తంత్రి కందరరావు రాజీవరు కుమారుడు కందరారు బ్రహ్మదత్తుడు, మేల్‌శాంతి అరుణ్‌కుమార్‌ నంబూద్రీల  ఆధ్వర్యంలో మండల పూజలు వైభవంగా  నిర్వహించారు. మండల పూజాకాలంలో ( డిసెంబర్ 26 వరకు)  శబరిమల అయ్యప్ప స్వామిని ...  దాదాపు 32.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

డిసెంబర్ 30 సాయంత్రం 5 గంటలకు మకరవిళక్కు ఉత్సవాల కోసం ఆలయం తెరవబడుతుంది. జనవరి 14న మకరవిళక్కు నిర్వహిస్తారు. జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు.జనవరి 14న శబరిమల కొండపై భక్తులు మకరజ్యోతిని దర్శించుకోనున్నారు. ఈ ప్రత్యేక ఘట్టానికి దేశవ్యాప్తంగా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు హాజరవుతారు. మకరజ్యోతి దర్శనం అయ్యప్ప స్వామి భక్తులందరికీ ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. 

ఇక జనవరి 20న పడిపూజతో శబరిమల యాత్ర ముగియనుంది. ఈ పూజతో కలిసి అయ్యప్ప స్వామి భక్తులు తాము తీసుకున్న దీక్షను ముగించుకుంటారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పూజతో యాత్రకు పూర్తి స్థాయి ముగింపు కలుగుతుంది.