రైల్వేశాఖ శబరిమల అయ్యప్ప భక్తులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు అయ్యప్ప భక్తుల కోసం ప్రకటించిన స్పెషల్ ట్నైన్లను రద్దు చేసింది. ప్రతి ఏడాది అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కొట్టాయం... కొల్లాం జంక్షన్.. తదితర ప్రాంతాలకు తెలుగు రాష్ట్రాలనుంచి ప్రత్యేక సర్వీసులను రైల్వేశాఖ నడుపుతుంది. మౌలాలి-... -కొట్టాయం, కాగజ్‌నగర్.... -కొల్లాం, కాచిగూడ-.... కొట్టాయం, నర్సాపూర్... -కొల్లాం, నాంపల్లి-.... కొట్టాయం మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయ్యప్ప భక్తుల నుంచి అనుకున్నంతగా స్పందన లేకపోవడంతో జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 ప్రకటించిన స్పెషల్ ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది
రద్దయిన ట్రైన్ల వివరాలు:
- Train No: 07167 మౌలా-అలీ - .... కొట్టాయం (జనవరి 24)
- Train No: 071 కాగజ్‌నగర్ - ...కొల్లాం (జనవరి 24)
- Train No: 07168 కొట్టాయం - ...మౌలా అలీ (జనవరి 25)
- Train No: 07171 మౌలా అలీ ...- కొల్లాం (జనవరి 25)
- Train No: 07169 కాచిగూడ.... - కొట్టాయం (జనవరి 26)
- Train No: 07162 కొల్లాం.... - సిర్పూర్ కాగజ్‌నగర్ (జనవరి 26)
- Train No: 07172 కొల్లాం -.... మౌలా అలీ (జనవరి 27)
- Train No: 07170 కొట్టాయం - ....కాచిగూడ (జనవరి 27)
- Train No: 07157 నర్సాపూర్ ...- కొల్లాం (జనవరి 27)
- Train No: 07158 కొల్లాం ...నర్సాపూర్(జనవరి 29)
- Train No: 07065 హైదరాబాద్ ... కొట్టాయం (జనవరి 28)
- Train No: 07066 కొట్టాయం -.... సికింద్రాబాద్ (జనవరి 29)
- Train No: 07167 మౌలా అలీ -.... కొట్టాయం (జనవరి 31)
- Train No: 07168 కొట్టాయం... - మౌలా అలీ (ఫిబ్రవరి 01)