అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 26 స్పెషల్ ట్రైన్స్..

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 26 స్పెషల్ ట్రైన్స్..

అయ్యప్పల సీజన్ ప్రారంభమైంది.  అయ్యప్ప భక్తులు మాల వేసకుని పూజలు చేస్తున్నారు.  శబరిమలలో మండల పూజలు ప్రారంభమయ్యాయి. శబరి కొండపై భక్తుల రద్దీ పెరిగింది.  ఈ క్రమంలో రైల్వే శాఖ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది.  ఇప్పటికే ఈ రైళ్లకు రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్‌(మౌలాలి) నుంచి కొల్లాంకు డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో, మచిలీపట్నం నుంచి కొల్లాంకు డిసెంబరు 2, 9, 16, 23, 30 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.  

కొల్లాం నుంచి మౌలాలికి డిసెంబరు 8, 15, 22, 29 తేదీల్లో.... కొల్లాం నుంచి మచిలీపట్నంకు డిసెంబరు 4, 11, 18, 25, జనవరి ఒకటవ తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. మౌలాలి-కొల్లాం మధ్య రైలు నెం.07143 నవంబర్ 22, 29... డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు ఖరారు చేసారు. ‌ కొల్లాం - మౌలాలి మధ్య రైలు నెం. 07144 నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో  స్పెషల్ ట్రైన్స్  ప్రకటించారు. మచిలీపట్నం-కొల్లం మధ్య (07145) ప్రత్యేక రైలు నవంబర్  25, డిసెంబర్ 2, 9, 16 తేదీల్లో నడ‌పుతున్నారు. కొల్లాం- మచిలీపట్నం రైలు నెం. 07146 నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18 తేదీల్లో మొత్తం 10 సర్వీసులను షెడ్యూల్ చేసారు. 

అదే విధంగా మచిలీపట్నం-కొల్లం రైలు నెం.07147 డిసెంబర్ 23, 30 తేదీల్లో నడ‌వనుంది. ఇక  కొల్లాం- మచిలీపట్నం రైలు నెం. 07148 డిసెంబర్ 25, జ‌న‌వ‌రి 1వ తేదీన మొత్తం నాలుగు స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. డిమాండ్ కు అనుగుణంగా డిసెంబర్ ద్వితీయార్ధంలో మరిన్ని ప్రత్యేక రైళ్ల పైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

మౌలాలి నుంచి బయల్దేరే రైలు తెలుగు రాష్ట్రాల్లో.. చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట జంక్షన్లలో అగుతుంది. మచిలీపట్నం నుంచి బయల్దేరే ట్రైన్ ఏపీలోని.. పెడన, గుడివాడ, విజయవాడ, కృష్ణా కెనాల్, న్యూ గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట జంక్షన్లలో అగుతుంది.

మచిలీపట్నం నుంచి బయల్దేరే మరో రైలు.. పెడన, గుడివాడ జంక్షన్, విజయవాడ, గుంటూరు జంక్షన్, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్డు, కుంభం, గిద్దలూరు, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట జంక్షన్లలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు.